కోవిడ్ -19ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. జూమ్ వీడియో ద్వారా మాట్లాడిన లక్ష్మణ్... కరోనా పరీక్షల విషయంలో హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను పరిశీలించేందుకు ఓ బృందాన్ని పంపాలని కేంద్రాన్ని కోరుతానని తెలిపారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలుస్తానని తెలిపారు.
కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు: కె. లక్ష్మణ్ - కొవిడ్-19 ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెవాలన్న భాజపా నేత లక్ష్మణ్
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మక్కు నీరెత్తినట్లు ఉందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతోన్న తరణంలో ప్రభుత్వ తీరును దుయ్యపట్టారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు: కె. లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాచరిక పాలన సాగిస్తున్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయడంలేదు. కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసు రక్షణకు చర్యలు తీసుకోవాలి. -కె. లక్ష్మణ్, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
ఇదీ చూడండి:రైతుబంధుపై దుష్ప్రచారం నమ్మొద్దు: కేటీఆర్