తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP SC Morcha: భాజపా 'దళితబంధు డప్పుల మోత'... హోరెత్తిన భాగ్యనగరం

ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పుల మోత కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌తో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు.

BJP SC Morcha
BJP SC Morcha

By

Published : Nov 9, 2021, 3:23 PM IST

రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేయాలని భాజపా ఎస్సీ మోర్చా డిమాండ్‌ చేసింది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరుతూ... హైదరాబాద్‌లో డప్పుల మోత కార్యక్రమం నిర్వహించింది. ఎల్బీ స్టేడియం నుంచి డప్పు చప్పుల్లతో చేపట్టిన నిరసన ర్యాలీ ట్యాంక్‌బండ్ వరుకు కొనసాగింది. రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. తక్షణమే రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేయాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. లేకుంటే తమ కార్యచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్‌, విజయశాంతి, రాజాసింగ్ సైతం పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details