తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్‌ ఎన్నికల్లో రెండో జాబితా విడుదల చేసిన భాజపా - జీహెచ్​ఎంసీ ఎన్నికలు 2020

bjp
bjp

By

Published : Nov 19, 2020, 8:50 PM IST

Updated : Nov 19, 2020, 10:38 PM IST

20:47 November 19

గ్రేటర్‌ ఎన్నికల్లో రెండో జాబితా విడుదల చేసిన భాజపా

గ్రేటర్‌ ఎన్నికల్లో రెండోజాబితాను భాజపా విడుదల చేసింది. 19 మందితో రెండో జాబితాను ప్రకటించింది. బుధవారం 21 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. 150 స్థానాలకుగాను 39 మందిని ప్రకటించిన కమలనాథులు మిగతా 111మంది అభ్యర్థులను ఉదయం ప్రకటించనున్నారు. 

ఈ రోజు రాత్రికి, రేపు ఉదయం మరికొందరు ఇతరపార్టీల నుంచి భాజపాలో చేరే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించడం లేదు. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఉదయం 11గంటల కల్లా పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

  1. హయత్‌నగర్‌-కల్లెం నవజీవన్‌రెడ్డి
  2. మన్సూరాబాద్‌-కొప్పుల నర్సింహారెడ్డి
  3. బీఎన్‌రెడ్డి - లచ్చిరెడ్డి
  4. చంపాపేట-మధుసూధన్‌రెడ్డి
  5. లింగోజిగూడ-రమేశ్‌గౌడ్
  6. కొత్తపేట-పవన్‌కుమార్‌
  7. చైతన్యపురి- నర్సింహగుప్తా
  8. సరూర్‌నగర్‌-ఆకుల శ్రీవాణి
  9. నాగోల్‌-చింతల అరుణ యాదవ్
  10. జాంబాగ్‌-రూప్‌ ధరక్‌
  11. గుడిమల్కాపూర్‌-దేవర కరుణాకర్‌
  12. గోల్కొండ-పాశం శకుంతల
  13. దత్తాత్రేయనగర్‌-ధర్మేంద్ర సింగ్
  14. మంగళ్‌హాట్‌- శశికళ
  15. జియాగూడ-బోయిని దర్శన్‌
  16. ఘాన్సీబజార్‌- రేణు సోని
  17. మైలార్‌దేవ్‌పల్లి- శ్రీనివాస్‌రెడ్డి
  18. జంగంమెట్‌-మహేందర్‌
  19. ఆర్‌.కె.పురం-రాధా ధీరజ్‌ రెడ్డి

ఇదీ చదవండి :జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన భాజపా

Last Updated : Nov 19, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details