భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికుల దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భాజపా నేతలు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జూబ్లీహిల్స్ డివిజన్ నేత పల్లపు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ శంకర్ విలాస్ చౌరస్తా, భగత్‌సింగ్ కాలనీ మీదుగా కొనసాగి ఫిలిం ఛాంబర్ వద్ద ముగిసింది.
జూబ్లీహిల్స్‌లో అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ర్యాలీ - భాజపా అమర జవాన్లు నివాళి ర్యాలీ
గాల్వన్ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు నివాళుర్పిస్తూ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భాజపా నేతలు ర్యాలీ చేపట్టారు. ఇకనైనా చైనా తన కవ్వింపు చర్యలు మానుకోవాలని వారు హితవు పలికారు.
BJP ryali
చైనా ఇకనైనా ఇటువంటి దుశ్చర్యలను మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భారత సైన్యం చేతిలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో బీజేపీ నేతలు బన్నప్ప, సుధాకర్ రెడ్డి, రాజశేఖర్, మిక్కీ సింగ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: చైనా బరి తెగింపు- గాల్వన్ లోయ తమదేనని ప్రకటన
Last Updated : Jun 22, 2020, 12:21 AM IST