BJP Deeksha: రాష్ట్రప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ప్రారంభించాలంటూ.. ఇందిరాపార్కు వద్ద ఇవాళ భాజపా నేతలు దీక్ష చేపట్టనున్నారు. 'వడ్లు కొను- లేదా గద్దె దిగు' నినాదంతో భాజపా దీక్ష చేపట్టనుంది. ఉదయం 10 గంటలకు మొదలయ్యే రైతు దీక్షలో కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర భాజపా ప్రముఖ నేతలు దీక్షలో పాల్గొననున్నారు.
BJP Deeksha: నేడు ఇందిరాపార్కు వద్ద భాజపా రైతు దీక్ష - ts news
BJP Deeksha: ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని వెంటనే ప్రారంభించాలనే డిమాండ్‌తో భాజపా ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి మురళీధరన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర భాజపా ప్రముఖ నేతలు దీక్షలో పాల్గొననున్నారు.

BJP Deeksha: నేడు ఇందిరాపార్కు వద్ద భాజపా రైతు దీక్ష
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే.. ధాన్యం కొనే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడంతో... రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. రైతులు నష్టపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
ఇదీ చదవండి:TRS Protest in Delhi: తెరాస ధాన్యం దంగల్.. నేడు దిల్లీలో కేసీఆర్ దీక్ష