పేద, మధ్య తరగతికి గుదిబండలామారనున్న జీవో నెంబర్ 131 వెంటనే రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు భాజపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
'మార్పుల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు' - జీఓ 131పై భాజపా ఫైర్
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు భాజపా నిరసన చేపట్టింది. జీవో నంబర్ 131 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

'మార్పుల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు'
ప్రభుత్వం కరోనా కాలంలో కర్కశంగా వ్యవహరిస్తూ.. రెవెన్యూ శాఖలో మార్పుల పేరుతో ప్రజల నడ్డివిరిచే జీవోలు తెచ్చి ప్రజా ధనాన్ని కొల్లగొట్టాలని చూస్తున్నారని భాజపా కన్వీనర్ వంగా మధుసూదన్ రెడ్డి, సామ రంగారెడ్డిలు ధ్వజమెత్తారు. వెంటనే జీవో రద్దు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.