భారతీయ పండుగలలో శాస్త్రీయత ఉంటుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడటంలో, భావితరాలకు అందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దోమలగూడలోని కూచిపూడి పార్కు, కవాడిగూడ డివిజన్లో ఈ పోటీలు జరిగాయి.
'భారతీయ సంస్కృతిని కాపాడటంలో మహిళలది కీలకపాత్ర' - ముగ్గుల పోటీల వార్తలు
సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దోమలగూడ, కవాడిగూడ డివిజన్లో మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఆకట్టుకునే రంగవల్లులతో అతివలు ముగ్గులు వేసి బహుమతులు అందుకున్నారు.
కె. లక్ష్మణ్, భాజపా, ముగ్గుల పోటీలు, ముషీరాబాద్
100 మందికి పైగా మహిళలు, యువతులు ఈ పోటీల్లో పాల్గొని ఆకట్టుకునేలా రంగవల్లులతో ముగ్గులు వేశారు. పోటీలో విజేతలుగా నిలిచిన మహిళలకు లక్ష్మణ్, కార్పొరేటర్ రచన.. బహుమతులను అందజేశారు.