ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

హెచ్​ఐసీసీలో భాజపా కార్యదర్శుల సమావేశం.. వాటిపైనే చర్చ..! - భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శుల సమావేశం

రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు, తదుపరి కార్యచరణపై హెచ్​ఐసీసీలో భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశాల్లో ప్రవేశపెట్టిన తీర్మానాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కార్యదర్శులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

హెచ్​ఐసీసీలో భాజపా కార్యదర్శుల సమావేశం.. వాటిపైనే చర్చ..!
హెచ్​ఐసీసీలో భాజపా కార్యదర్శుల సమావేశం.. వాటిపైనే చర్చ..!
author img

By

Published : Jul 4, 2022, 10:58 AM IST

హైదరాబాద్ హెచ్​ఐసీసీలో భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శుల సమావేశం జరిగింది. సమావేశానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ కార్యదర్శి సంతోశ్​ సహా.. అన్ని రాష్ట్రాల కార్యదర్శులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన తీరు, తదుపరి కార్యచరణపై సమావేశంలో చర్చించారు.

కార్యవర్గ సమావేశాల్లో చర్చించిన అంశాలు, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులపై నేతలు చర్చలు జరిపారు . తీర్మానాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై కార్యదర్శులకు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details