తెలంగాణ

telangana

ETV Bharat / state

Bjp Telangana Meeting: రేపు భాజపా పదాధికారుల సమావేశం - Telangana news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన రేపు ఆ పార్టీ పదాధికారుల (Bjp Telangana Meeting) సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

Bjp
భాజపా

By

Published : Oct 31, 2021, 9:57 PM IST

భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం రేపు ఉదయం పదిన్నర గంటలకు, జిల్లా అధ్యక్షులు ఇంఛార్జిల సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకు ఏర్పాటు (Bjp Telangana Meeting) చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, శివప్రకాశ్​, మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొంటారని వివరించారు.

ఈ సమావేశాల్లో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు హుజూరాబాద్ ఉపఎన్నిక సమీక్షించడం, ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడతపై చర్చిస్తామని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతుందనే సంకేతాలు రావడం వల్ల దివాళాకోరుతనంతో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈవీఎంలను తెరాస అక్రమంగా తరలించే వ్యవహార శైలిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెరాస అధికార అహంకారంతో భాజపా కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details