పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఇరుకు గదుల్లో ఏర్పాటు చేశారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ గాంధీ నగర్‌లోని తూనికలు-కొలతల శాఖ భవనంలో లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్ - తెలంగాణ వార్తలు
హైద్రాబాద్ గాంధీనగర్‌లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ స్వేచ్ఛగా ఓటు వేయడం శుభపరిణామని ఆయన అన్నారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం శుభపరిణామం: లక్ష్మణ్
విద్యావంతులు, పట్టభద్రులు, మేధావులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభపరిణామమన్నారు. లక్ష్మణ్‌తో పాటు ఆయన కుమారుడు, కోడలు, కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి:ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు