యావత్ ప్రపంచంలో దేశంలోని 27 కోట్ల మంది ప్రజలకు ప్రప్రథమంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని భాజాపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఆశా కార్యకర్తలకు ఆయన నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ పాల్గొన్నారు.
Groceries distribution: ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ - laxman distributed daily commodities to asha workers
హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ
అగ్రగామి దేశంగా పేరుగాంచిన అమెరికాలో కూడా ప్రజలకు ఉచితంగా టీకాలు ఇవ్వలేరని లక్ష్మణ్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధాని మోదీ ఎంతగానో కృషి చేశారని అన్నారు. అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?