పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ 3వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టడం మహిళలకు గర్వకారణమని... భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా... ఆత్మ నిర్భర ప్యాకేజీకి భారీగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. వైద్య రంగానికి రూ. 2.2 లక్షల కోట్లు కేటాయించారని... కొవిడ్ వ్యాక్సిన్ అందరికీ అందించేందుకు రూ. 35 వేల కోట్లు కేటాయించారని తెలిపారు.
వైద్య రంగానికి భారీ కేటాయింపులు ఇవ్వడం అభినందనీయమని అరుణ పేర్కొన్నారు. విద్యా రంగంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు చేశారన్నారు.