తెలంగాణ

telangana

ETV Bharat / state

DK Aruna on KCR: 'హామీలు నెరవేర్చే వరకు కేసీఆర్​ను వెంటాడతాం..' - తెలంగాణ బీజేపీ వార్తలు

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చలించని కేసీఆర్​కు.. పంజాబ్​ రైతుల మీద కనికరం కలిగిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు (DK Aruna on KCR). కేసీఆర్​ ప్రకటనలన్నీ రాజకీయ లబ్ధికోసమేనని ఎద్దేవా చేశారు.

DK Aruna
DK Aruna

By

Published : Nov 23, 2021, 7:17 PM IST

dk aruna on kcr: దళితబంధు పథకాన్ని అమలు చేసే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భాజపా వెంటాడి, వేటాడుతుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చలించని కేసీఆర్​కు పంజాబ్ రైతుల మీద కనికరం కలిగిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పథకాలన్నీ కాగితాలకే పరిమితమని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్​ దళితబంధు తీసుకొచ్చారని ఆరోపించారు. కల్యాణలక్ష్మీ చెక్కుల కోసం తిరిగి, తిరిగి లబ్ధిదారుల చెప్పులు అరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. రూ.లక్ష చెక్కుకోసం 50వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సుమారు 1400 మంది ప్రాణత్యాగం చేస్తే.. ఆ కుటుంబాలను పట్టించుకోలేదని, రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పంజాబ్ రైతుల మీద కలిగిన దయ తెలంగాణ అమరవీరుల మీద ఎందుకు రాలేదని నిలదీశారు.

కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క మెడికల్​ కాలేజీ కూడా ఇవ్వలేదని తెరాస ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని డీకే అరుణ ఆరోపించారు. ప్రతి ఏరియా ఆస్పత్రిని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చుతామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు కానీ.. ఒక్క ఆస్పత్రిని అయినా మార్చారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తోందని... కేంద్రాన్ని విమర్శించే స్థాయి కేసీఆర్, మంత్రులకు లేదని పేర్కొన్నారు. దేశంలోనే అబద్ధాల ముఖ్యమంత్రిగా కేసీఆర్​కు బిరుదు ఉందన్నారు.

ఇందిరా పార్కు ధర్నా చౌక్ తీసేసిన కేసీఆర్​ని ధర్నా చౌక్​లో భాజపా కూర్చోపెట్టింది. ధర్నా చేసే అర్హత, హక్కు కేసీఆర్​కు లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కే కేసీఆర్ దిల్లీలో ధర్నా చేస్తారంట.. తండ్రి, కొడుకు, అల్లుడి నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తెరాస నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. సరైన సంఖ్యాబలం లేనందునే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా పోటీ చేయడం లేదు. దళిత బంధు అమలు చేసే వరకు కేసీఆర్​ను భాజపా వెంటాడుతుంది, వేటాడుతుంది. -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

ఇదీ చూడండి:MLC elections in telangana:ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి భాజపా దూరం!

ABOUT THE AUTHOR

...view details