తెలంగాణ

telangana

ETV Bharat / state

DK Aruna Fire on Cm Kcr: 'ప్రధానమంత్రి కుర్చీపై సీఎం కేసీఆర్‌ కన్ను' - Dk aruna comments on kcr

DK Aruna Fire on Cm Kcr: పీఎం కుర్చీపై సీఎం కేసీఆర్​ కన్నుపడిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యంగా కామెంట్స్ చేశారు.

DK Aruna
DK Aruna

By

Published : Feb 15, 2022, 7:46 PM IST

'ప్రధానమంత్రి కుర్చీపై సీఎం కేసీఆర్‌ కన్ను'

DK Aruna Fire on Cm Kcr: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అకస్మాత్తుగా ప్రజలు, దేశంపై ప్రేమ పుట్టుకొచ్చిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కుర్చీపై కేసీఆర్‌ కన్నేశారని ఆమె ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే తెలంగాణ ఇండియాలో భాగమా కాదా అనే అనుమానం కలుగుతోందన్నారు. కేసీఆర్‌ భారతదేశంలోనే పుట్టారా అని ప్రశ్నించారు. భారత సైనిక అధికారులు చెప్పే అంశాలు నమ్మరు కానీ తీవ్రవాది అజర్‌ మక్సూద్‌ చెప్పే మాటలు మాత్రం నమ్ముతారని మండిపడ్డారు.

కేసీఆర్​ను డాక్టర్​కు చూపించాలి..

తీవ్రవాదులకు కేసీఆర్‌ తొత్తుగా మట్లాడతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక దేశం... ప్రత్యేక రాజ్యాంగం కావాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ పేరు ఉచ్చరిస్తే నోరు పడిపోతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ను వైద్యులకు చూపించాలని సూచించారు. ఒకప్పుడు రాహుల్ గాంధీని బిగెస్ట్ బపూన్ అని తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. హిమంత బిశ్వ శర్మ మాటలను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రగడ్డ పోతారా లేక చర్లపల్లికి వెళతారో నిర్ణయించుకోవాలన్నారు.

దేశ రాజకీయాలంటే పేరు వస్తదని.. కేసీఆర్​ దేశాన్నే ఉద్దరిస్తడంటా.. ఏకంగా నరేంద్రమోదీనే తిడుతున్నడంట అని ప్రజలు అనుకోవాలని ఈ డ్రామా అంతా. ఛీ కొడుతున్నరు నీ భాషను చూసి. నువ్వు ఎక్కడ నరేంద్రమోదీ ఎక్కడ.. నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీకు మోదీతో పోలికా? తెలంగాణ రాష్ట్రమంటేనే కల్వకుంట్ల కుటుంబం అయిపోయింది. నీకెందుకు కోపం వచ్చింది రాహుల్​గాంధీని తిడితే. ఒకప్పుడు నువ్వే కాద రాహుల్​ గాంధీని బిగ్గెస్ట్ బఫూన్ అన్నది. హిమంత బిశ్వశర్మ ఏం తప్పు మాట్లాడలేదు. ఆయన మాటల్ని వక్రీకరించారు.

-- డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details