తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుంది: డీకే అరుణ - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ తాజా వార్తలు

రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుతింటోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. అసెంబ్లీలో బండి సంజయ్​పై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. హరీశ్​ రావు శాసనసభ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

bjp national vice president dk aruna
డీకే అరుణ

By

Published : Mar 26, 2021, 5:28 PM IST

ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అసెంబ్లీ వేదికగా బండి సంజయ్​పై పచ్చి అబద్ధాలు చెప్పాడని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ అన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్న కేసీఆర్ కుటుంబం.. బండి సంజయ్​ని విమర్శిస్తోందని మండిపడ్డారు.

సభా, సంప్రదాయాలు కూడా హరీశ్​ రావుకు తెలియక పోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులపై బండి సంజయ్ రాసిన లేఖను హరీశ్​ రావు చదివారా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపైన ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులను అపలేని అసమర్థ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రాజెక్టులపై అడ్డగోలుగా అంచనాలు పెంచి రాష్ట్రాన్ని... అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్లకుండా జూరాల దగ్గర కాళ్లు అడ్డంపెట్టి ఆపుతానంటివి కేసీఆర్.. ఇప్పుడు ఆ కాళ్లు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు. నీళ్ల పేరు చెప్పి తెలంగాణ రైతులను కేసీఆర్ కుటుంబం దగా చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసం తెచ్చిన డబ్బుల్లో మూడో వంతు ఎన్నికల్లో గెలిచేందుకే ఖర్చు పెడుతున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:హరీశ్​ అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్: బండి

ABOUT THE AUTHOR

...view details