తెలంగాణ

telangana

ETV Bharat / state

'తితిదే ఆస్తుల వేలాన్ని పూర్తిగా రద్దుచేయాలి' - తితిదే ఆస్తుల వేలాన్ని రద్దుచేయాలన్న సత్యకుమార్​ వార్తలు

తితిదే ఆస్తుల వేలం ప్రక్రియను ఏపీ ప్రభుత్వం పూర్తిగా రద్దుచేయాలని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్​ డిమాండ్​ చేశారు. ఆలయ భూములను సంయుక్త కలెక్టర్​ పరిధిలోకి తీసుకురావడం అనుమానాలకు తావిస్తోందన్న ఆయన.. జీవో నెంబర్​ 39 నుంచి దేవాదాయ శాఖని తప్పించాలని అన్నారు.

bjp national secretary Satyakumar
'తితిదే ఆస్తుల వేలాన్ని పూర్తిగా రద్దుచేయాలి'

By

Published : May 26, 2020, 5:12 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం ప్రక్రియను తాత్కాలికంగా ఆపడం కాదని.. పూర్తిగా రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వాన్ని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆ స్థల యాజమాన్య హక్కులు తమ వద్ద ఉంచుకుంటూనే.. దాతల సహకారంతో అక్కడ పాఠశాలలు, ధర్మప్రచార కార్యాలయాలను అభివృద్ధి చేయాలని సూచించారు.

టీటీడీ ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ భాజపా ఇచ్చిన పిలుపు మేరకు ఆయన దీక్ష చేపట్టారు. ఒక్క టీటీడీనే కాదు.. ఆలయాల భూముల పరిరక్షణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు. కొత్తగా నిమమిస్తోన్న సంయుక్త కలెక్టర్‌ పరిధిలోకి ఆలయ భూములను తీసుకురావడం అనుమానాలకు తావిస్తోందన్నారు. వెంటనే జీవో నెంబర్‌ 39 నుంచి దేవాదాయ శాఖని తప్పించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:'రద్దు చేయమన్నది ఒక జీవో... ప్రభుత్వం చేసింది ఇంకొకటి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details