భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పరామర్శించారు. భౌతిక దాడులను ఖండిస్తున్నామన్నారు. పశ్చిమ బంగా ప్రభుత్వానికి, తెలంగాణ సర్కారుకు తేడా లేకుండా పోతోందన్నారు. ఎంఐఎంకు వత్తాసు పలుకుతున్న అధికారులను వెంటనే తొలిగించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పరామర్శించిన మురళీధరరావు - ఎమ్మెల్యే రాజాసింగ్
గత రాత్రి స్వాతంత్య్ర పోరాట యోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో గాయపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పరామర్శించారు. రజాకార్ల వారసత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పరామర్శించిన మురళీధరరావు