తెలంగాణలో చేరికలపై భాజపా జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పలుమార్లు చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు దిల్లీ పెద్ధలు సూచించారు. ఇగోలు పక్కన పెట్టాలని చెప్పినా.. రాష్ట్ర నేతలు పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. నేతల మధ్య ఏకాభిప్రాయం రాక... ఒకరు తెచ్చిన వ్యక్తిని మరొకరు అడ్డుకోవడంతో చేరికలు ఆగిపోయాయని సమాచారం.
'ఇగోలు పక్కన పెట్టండి... పార్టీలోకి వచ్చేవారిని వదులుకోకండి..' - BJP national leaders on joinings
చేరికలపై రాష్ట్ర నేతలకు భాజపా జాతీయ నేతలు దిశానిర్దేశం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చేవారిని వదులుకోవద్దనే సంకేతాన్ని అమిత్ షా, నడ్డా ఇచ్చినట్లు సమాచారం.
ఇదే అంశాన్ని కొంతమంది నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా... రాష్ట్ర నేతలను మందలించారు. చేరికలపై దిల్లీ నేతలు వారికి క్లారిటీనిచ్చారు. కమిటీలో ఎవరు ఉండాలన్న పేర్లను ఫైనల్ చేశారు. ఏకాభిప్రాయం ఉంటే చేర్చుకోవాలని.. ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండని ఖరాఖండిగా చెప్పినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఎవరిని వదులుకోవద్దనే సంకేతాన్ని అమిత్ షా, నడ్డా ఇచ్చినట్లు సమాచారం. 24 గంటలు అందుబాటులో ఉంటూ అన్ని రకాల సహాయ సహాకారాలకు సిద్ధమని జాతీయ నాయకత్వం నేతలకు స్పష్టం చేసింది.
ఇవీ చూడండి:ముషారఫ్‌కు కళ్లెం వేసిన కలాం.. కశ్మీర్‌పై మాట్లాడకుండా చేసి..