తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ విషయంలో కేటీఆర్​ను మించినోళ్లు లేరు: భూపేంద్రయాదవ్​ - భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి భూపేంద్రయాదవ్‌ తాజా వార్తలు

రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసానికి అల్పాహార విందుకు భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి భూపేంద్రయాదవ్‌ హాజరయ్యారు. అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్​ను మించిన వాళ్లు లేరని విమర్శించారు.

bhupendra yadav
ఆ విషయంలో కేటీఆర్​ను మించినోళ్లు లేరు: భూపేంద్రయాదవ్​

By

Published : Nov 28, 2020, 12:16 PM IST

గ్రేటర్‌ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి-రాచరికానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, జీహెచ్​ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్​ భూపేంద్రయాదవ్‌ అన్నారు. అబద్ధాలు చెప్పటంలో మంత్రి కేటీఆర్‌ను మించిన వాళ్లు లేరన్నారు.

రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసానికి అల్పాహార విందుకు భూపేంద్రయాదవ్‌ హాజరయ్యారు. తెరాస ప్రభుత్వ అవినీతిపై భాజపా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. భూపేంద్రయాదవ్​తో తనకు అనుబంధం ఉందని... జీహెచ్​ఎంసీ ఎన్నికల ఇంఛార్జ్​గా రావడం వల్ల అల్పాహార విందుకు ఆహ్వానించినట్లు గరికపాటి మెహన్​రావు తెలిపారు.

ఆ విషయంలో కేటీఆర్​ను మించినోళ్లు లేరు: భూపేంద్రయాదవ్​

ABOUT THE AUTHOR

...view details