తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP National General Secretary Bandi Sanjay America Tour : అమెరికా పర్యటనకు బండి సంజయ్​.. 10 రోజులు అక్కడే - BJP latest news

BJP National General Secretary Bandi Sanjay America Tour Schedule : ఇవాళ తెల్లవారుజామున.. బండి సంజయ్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్‌ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు.

Bandi Sanjay Wishes Rakshabandhan Festival
Bandi Sanjay America Tour Today

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 5:11 PM IST

BJP National General Secretary Bandi Sanjay America Tour Schedule :బీజేపీ(BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు తెల్లవారుజామున యూఎస్ వెళ్లిన ఆయన పది రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ 15వ వార్షికోత్సవంలో బండి సంజయ్ ప్రసంగించనున్నారు. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌, న్యూజెర్సీ, డల్లాస్‌ సహా పలు రాష్ట్రాల్లో అయన పర్యటన ఖరారయింది. ఈ సందర్భంగా పలు ఎన్‌ఆర్‌ఐ సంఘాలతో బండి సంజయ్‌ సమావేశమవుతారు. యూఎస్‌ సందర్శన నేపథ్యంలో న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్ బిల్ బోర్డుపై సంజయ్‌ నిలిచారు.

Bandi Sanjay Cycle Ride : సైకిలెక్కిన బండి.. పిల్లలతో సరదాగా ముచ్చట్లు

Bandi Sanjay Wishes Rakshabandhan Festival :అమెరికా పర్యటనకు ముందు కరీంనగర్​ నగరంలోని పలువురు ముస్లిం సోదరులు బండి సంజయ్​కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోదరభావ అనుబంధానికి చిహ్నంగా నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనమిద్దరం.. ధర్మానికి, సమాజానికి, దేశానికి రక్షా అనే ఆలోచనతో జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి అని బండి సంజయ్(Bandi Sanjay)​ పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్న హిందువులందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Bandi Sanjay Interesting Comments on Assembly Elections 2023 : 'ఎంపీలంతా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలన్న దానిపై చర్చ జరగలేదు'

Bandi Sanjay Latest News :ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యము దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, సమాజం కోసం, పేదల బాగు కోసం, ముందుకు సాగినప్పుడే రక్షాబంధన్​కు సార్ధకత ఉంటుందని పేర్కొన్నారు. అన్నాచెల్లెల అనురాగానికి చిహ్నంగా నిలిచిన రక్షాబంధన్ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని.. దేశంలోని సోదరి భావాన్ని పెంపొందించాలని బండి సంజయ్ కుమార్ కోరారు.

"ప్రజలందరికీ రక్షాబంధన్​ శుభాకాంక్షలు. సోదరభావ అనుబంధానికి చిహ్నంగా.. నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష.. మనమిద్దరం.. ధర్మానికి, సమాజానికి, దేశానికి రక్షా అనే ఆలోచనతో జరుపుకునే పండగే రాఖీ పౌర్ణమి. పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్న హిందువులందరూ సంతోషంగా ఉండాలి. అన్నాచెల్లెల అనురాగానికి చిహ్నంగా నిలిచిన రక్షాబంధన్ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి. దేశంలోని సోదరి భావాన్ని పెంపొందించాలి". - బండి సంజయ్​, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

BJP National General Secretary Bandi Sanjay America Tour అమెరికా పర్యటనకు బండి సంజయ్​ 10 రోజులు అక్కడే

Bandi Sanjay Family Meet PM Modi : మోదీని కలిసిన బండి.. 'దేశ్ కీ నేతగా అయ్యావని అభినందనలు'

ABOUT THE AUTHOR

...view details