తెలంగాణ

telangana

'కార్మికులపై సీఎం కేసీఆర్​ మొండిగా వ్యవహరిస్తున్నారు'

By

Published : Oct 20, 2019, 8:10 PM IST

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, హుజూర్ నగర్ ఉప ఎన్నిక, పార్టీలో చేరికలు, పార్టీ బలోపేతంపైన చర్చించారు.

Bjp National General Secretary arun singh On TSRtc

రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​సింగ్​ మండిపడ్డారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదాధికారుల సమావేశానికి అరుణ్​సింగ్​ హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, హుజూర్​నగర్ ఉప ఎన్నిక, పార్టీలో చేరికలు, పార్టీ బలోపేతంపైన చర్చించారు. అకారణంగా 48 వేల ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించటం దుర్మార్గమని అరుణ్​సింగ్​ పేర్కొన్నారు. సమ్మెపై హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ కార్మికుల బంద్​లో తమ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్​తో పాటు చాలామందిని అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. కార్మికుల పక్షాన పోరాటం చేసిన వాళ్లను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్​ దురహంకారంతో వ్యవహరిస్తున్నారని అరుణ్​సింగ్​ విమర్శించారు. ఈ సమావేశానికి ఎంపీ అర్వింద్​, ఎమ్మెల్సీ రామచందర్ రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి హాజరయ్యారు.

'కార్మికులపై సీఎం కేసీఆర్​ మొండిగా వ్యవహరిస్తున్నారు'

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details