తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP IN TELANGANA: 'తెలంగాణలో డబుల్​ ఇంజిన్ సర్కార్ తీసుకురావడమే లక్ష్యం' - భాజపా

BJP IN TELANGANA: రాష్ట్రంలో మార్పుఖాయమని, భాజపా ప్రభుత్వ ఏర్పాటు తథ్యమని కమలదళం విశ్వాసం వ్యక్తంచేసింది. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరేలా డబుల్ ఇంజన్ సర్కార్‌ కోసం ప్రయత్నం చేస్తామని జాతీయ కార్యవర్గ సమావేశంలో భాజపా ప్రత్యేక ప్రకటన చేసింది. మోదీ చరిష్మాను చూసి తెరాస కాళ్ల కింద భూమి కదులుతోందని ఎద్దేవా చేసింది. అవినీతిలో కూరుకుపోయిన తెరాస సర్కార్‌ను 2024లో ప్రజలే ఇంటికి పంపుతారని విశ్వాసం వ్యక్తంచేసింది.

BJP IN TELANGANA
జాతీయ కార్యవర్గ సమావేశం

By

Published : Jul 3, 2022, 7:58 PM IST

BJP IN TELANGANA: హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణపై ప్రత్యేకంగా చర్చించిన భాజపా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజకీయ తీర్మానం సందర్భంగా తెలంగాణలో పరిస్థితులను భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కార్యవర్గ సభ్యులకు వివరించారు. అనంతరం ప్రకటన చేసిన పార్టీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యం నెరవేరలేదని విమర్శించింది. 8 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఎన్నో నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ బడ్జెట్‌ను 40 వేల నుంచి లక్షా 30 వేల కోట్లకు పెంచడం నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొంది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికలు సహా జీహెచ్​ఎంసీలో మంచి విజయాలు సాధించిన భాజపా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అవినీతిలో కూరుకుపోయిన తెరాస భూస్థాపితమవుతుందన్నారు. మోదీ పాపులారిటీ చూసి.. కేసీఆర్‌ భయపడుతున్నారని పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మోదీ భయంతోనే 2018లో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపించారు.

'తెలంగాణలో డబుల్​ ఇంజిన్ సర్కార్ తీసుకురావడమే లక్ష్యం'

తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలుసు ఇక్కడ అవినీతి ఎలా జరుగుతుందో. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం. హైదరాబాద్‌కు మంచి ఆదాయం వస్తుంది. అందుకు తగినట్లుగా ఖర్చు చేస్తున్నారో లేదో చూడాల్సి ఉంది. అవకతవకలను పరిశీలించి వాటిపై దర్యాప్తు చేయాలి. వారు(తెరాస) చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వారు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. వారి ప్రకటనలు భయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మా నేతలు రెండు రోజులు వెళ్లి ఫీడ్‌బ్యాక్ తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు బాధల్లో ఉన్నారు. మార్పును కోరుకుంటున్నారు. మేము వచ్చే ఎన్నికల్లో ప్రతి సీటులోనూ పోటీ చేస్తాం. ప్రతి సీటును గెలుస్తాం. - పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి


తెరాస సర్కార్ స్టీరింగ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ చేతిలో ఉందని మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయానికిరాని ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరేనని విమర్శించారు. తెలంగాణలో మార్పు ఖాయమన్నారు. భాజపా మద్దతుతోనే తెలంగాణ సాకారమైందన్న బండి సంజయ్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగట్లేదని ఆరోపించారు. భాజపా పోరాటం చూసి కేసీఆర్‌లో భయం మొదలైందన్నారు. మోదీని సేల్స్​మెన్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నడం ప్రధానిని అవమానపరిచడమేనని బండి సంజయ్ ఆక్షేపించారు.


ఇవీ చదవండి:'ఎన్నికల తర్వాత సచివాలయానికి వెళ్లే అవకాశం మాకే దక్కుతుంది'

గోద్రా అల్లర్ల కేసు దోషికి జీవిత ఖైదు

ABOUT THE AUTHOR

...view details