సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు హైదరాబాద్‌లోని సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాంతో పాటు గన్‌పార్కులోని అమరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అసెంబ్లీ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావుతో పాటు కమలం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, డీకే అరుణ, భాజపా శ్రేణులు పాల్గొన్నారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని నినదించారు.
భాజపా నూతన ఎంపీల విజయోత్సవ ర్యాలీ - భాజపా విజయోత్సవ ర్యాలీ
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు భాజపాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నూతనంగా ఎన్నికైన ఎంపీలు హైదరాబాద్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు.
భాజపా ర్యాలీ