తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్, ఒవైసీ కూడా ఎన్​పీఆర్​లో నమోదు చేయించుకోవాల్సిందే' - kcr

సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడంపై భాజపా ఎంపీలు, నేతలు... దిల్లీలోని తెలంగాణ భవన్​ అంబేడ్కర్​ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

BJP MPs and leaders take silent protest at Telangana Bhawan Ambedkar statue in Delhi
'సీఏఏపై అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితం'

By

Published : Mar 17, 2020, 1:38 PM IST

కేసీఆర్​ వ్యవహారం చూస్తే యావత్​ తెలంగాణ తలదించుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ పేర్కొన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయండపై భాజపా ఎంపీలు దిల్లీలోని తెలంగాణ భవన్​ అంబేడ్కర్​ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. సీఏఏ వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని భాజపా నేతలు డిమాండ్​ చేశారు.

వాస్తవాలు తెలుసుకోకుండా కేసీఆర్​ వ్యవహరిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ముస్లింలు వేరే దేశం నుంచి వస్తే... దేశంలోని ముస్లింల పొట్టకొట్టినట్లేనని వెల్లడించారు. ముస్లిం ఓట్ల కోసమే సీఏఏ వ్యతిరేక తీర్మానం చేశారని ఆరోపించారు. కేసీఆర్​ అయినా.. ఒవైసీ అయినా ఎన్​పీఆర్​లో నమోదు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దేశం గురించి ఆలోచించే సమయం కేసీఆర్​కు ఎక్కడుందని ఎద్దేవా చేశారు.

రైతులు, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్​ పట్టించుకోలేదన్నారు. సీఏఏ, ఎన్​పీఆర్​ అమలు జరిగి తీరుతుందని ప్రకటించారు. అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితమని వ్యాఖ్యానించారు.

'సీఏఏపై అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితం'

ఇదీ చూడండి:ఆర్​బీఐ అభయంతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details