తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎస్టీ 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం: సుబ్రహ్మణ్య స్వామి - latest news on mp Subramanyaswammy

మోదీ సర్కారు తీసుకువచ్చిన జీఎస్టీ... 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయమని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

mp subramanyaswamy
mp subramanyaswamy

By

Published : Feb 20, 2020, 9:13 AM IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ.. 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయమని.. ఇది చాలా సంక్లిష్టమైనదని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. దేనికి ఎప్పుడు ఏ ఫారం పూర్తి చేయాలో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారన్నారు. హైదరాబాద్​లోని ఓ హోటల్​లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2030 నాటికి భారతదేశం ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది అనే అంశంపై ప్రసంగించారు.

2030 కల్లా మన దేశం ఆర్థికంగా మరింత బలపడాలంటే ఏటా పది శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్లాల్సి ఉందని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.

జీఎస్టీ 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయం: సుబ్రహ్మణ్య స్వామి

ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులకు "పదవి" పరీక్ష

ABOUT THE AUTHOR

...view details