Soyam Bapurao On Party Changes Rumours : పార్టీ మారుతున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై వస్తోన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నట్లు తనపై వస్తున్న ప్రచారం అవాస్తవమని తేల్చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనపై కొందరు పనిపెట్టుకొని మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అర్థం లేని ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.
ఈనెల 27వ తేదీన తన కుమారుడి వివాహం ఉందని అందువలన శుభలేఖలను అన్ని పార్టీల నేతలకు ఇస్తున్నానని తెలిపారు. పార్టీలకు అతీతంగా పెళ్లికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నానట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే కేసీఆర్, రేవంత్ రెడ్డిని సైతం పెళ్లికి ఆహ్వాననిస్తాని స్పష్టం చేశారు. అంతే గాని ఇందులో మరి ఏ ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు.
మహేశ్వర్‌రెడ్డితో విభేదాలు లేవు: మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి తానే ఆహ్వానించానని గుర్తు చేసుకొన్న సోయం బాపూరావు.. ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం వెనుక బీఆర్‌ఎస్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ దేశమంతా గెలిచినట్లు కాదని విమర్శించారు. బీజేపీ ఓడిపోయినా ఓట్ల శాతం తగ్గలేదన్నారు.
"కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు నాపై తప్పడు ప్రచారం చేస్తున్నారు. ఈనెల 27న నా కుమారుడి వివాహం ఉంది. దానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నా..పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే కేసీఆర్, రేవంత్‌రెడ్డిని కలిశాను. పార్టీలకు అతీతంగా అన్నీ రాజకీయ పార్టీల నేతలు హాజరుకావాలని కోరుతున్నాను. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినా.. ఓట్ల శాతం తగ్గలేదు. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిస్తే దేశమంతా గెలిచినట్లు కాదు."- సోయం బాపూరావు, బీజేపీ ఎంపీ
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్రంలో జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్‌లపై చర్చ జరుగుతుండగా.. తాజాగా సోయం బాపూరావుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎన్నికలు దగ్గర పడటంతో ఇప్పటి నుంచే రాజకీయం వేడిక్కింది. దానికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరింత హీట్ రాజేశాయి.
వరుస పరాజయాలతో ఉన్న కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనంతరం జోష్ నింపుకొంది. తెలంగాణ, కర్ణాటక పక్కపక్క రాష్ట్రాలు కావడంతో సరిహద్దు జిల్లాలో కొంత మేర ఆ ఎన్నికల ఫలితాలు ఉండొచ్చనని రాజకీయ విశ్లేషుకుల అభిప్రాయం. రేపు కేసీఆర్ అధ్యక్షతను బీఆర్‌ఎస్ పార్లమెంటరీ స్థాయి మీటింగ్ జరగనుంది. ఇందులో రోడ్డు మ్యాప్, ఎన్నికల సన్నద్దత గురించి చర్చించనున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఇవీ చదవండి: