BJP MP Laxman Reacts On X on KTR Tweet : ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ ప్రజా గర్జనలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2018లో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధమని అప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ అన్నారని.. అవసరమైతే బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్ధతుగా నిలుస్తుందని చెప్పారని కేటీఆర్‌ట్వీట్ చేశారు.
MP Laxman Fires on KTR :2018 బీజేపీ బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తుందని తాను చెప్పినట్లు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని బీజీపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అది అసత్య ప్రచారమన్న ఆయన.. దురుద్దేశపూరితంగా కేటీఆర్ ఇలాంటి కామెంట్స్ చేశారని మండిపడ్డారు. బుకాయించడం, దబాయించడం, అబద్ధాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని విమర్శఇంచారు. తమ తప్పులను ఎత్తిచూపితే మంటతో బట్టగాల్చి మీదేసేలా ఇతరులపై నిందలు, దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ హామీలు, వెకిలిచేష్టలు, అబద్ధపు ప్రచారాలు చేయటం కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్‌ఎస్ నాయకులకు అలవాటేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. రూ.8 వేల కోట్ల పనులు ప్రారంభం
BJP Leader Laxman Tweet on KTR : బీజేపీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నడచుకునే పార్టీ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అవసరాల కోసం పక్క దారులు తొక్కే పార్టీ అని ఆరోపించారు. ఎన్నికలు వస్తే చాలు.. ఏదో ఒక పార్టీతో లాలూచీ పడటం, కేవలం స్వార్ధపూరిత రాజకీయాల కోసం పొత్తుల డ్రామాలు చేసి ఓట్ల రాజకీయం చేయడం వాళ్ల నైజం అని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ.. వంచన అనే పునాదిపై స్థాపితమైన పార్టీ అని.. విధివిధానాలతో సంబంధం లేకుండా నడచుకుంటుందని వ్యాఖ్యానించారు.