తెలంగాణ

telangana

ETV Bharat / state

'కమ్యూనిస్టు పార్టీల ప్రకటనల వెనుక కేసీఆర్​ కుట్ర ఉంది' - ప్రధాని తెలంగాణ రాక

BJP MP Laxman got angry with the Communist Partys: మోదీ పర్యటనను అడ్డుకుంటామనే కమ్యూనిస్టు పార్టీల ప్రకటనల వెనక కేసీఆర్​ కుట్ర ఉందని భాజపా ఎంపీ లక్ష్మణ్​ విమర్శించారు. ఈ ప్రభుత్వం పని చేయదు.. పని చేసే ప్రభుత్వాలను అడ్డుకుంటుందని మండిపడ్డారు.

BJP MP Laxman got angry with the Communist Partys
భాజపా ఎంపీ లక్ష్మణ్​

By

Published : Nov 9, 2022, 3:25 PM IST

BJP MP Laxman got angry with the Communist Partys: అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామనే కమ్యూనిస్టు పార్టీల ప్రకటన వెనక కేసీఆర్‌ కుట్ర దాగి ఉండని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ విమర్శించారు. దక్షిణాదికే కాకుండా దేశంలోని రైతులకు మేలు చేసేందుకు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న మోదీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే సింగరేణి ప్రైవేటీకరణ జరుగుతోందని వివరించారు. మూడేళ్లుగా నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదని లక్ష్మణ్‌ నిలదీశారు.

రామగుండం కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.6వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి, జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తా ఉంటే.. అలాగే రాష్ట్రంలో అనేక రహదారుల నిర్మాణానికి పూనుకుంటూ ఉంటే కేసీఆర్​ కనుసన్నల్లో కమ్యూనిస్టులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధిని ఓర్వలేక మీరు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారా.. మీరు చేయరు.. చేసే ప్రభుత్వాలను అడ్డుకుంటున్నారు.. దీన్ని ప్రజలు ఊరుకోరు. - కె. లక్ష్మణ్‌, భాజపా పార్లమెంట్ సభ్యుడు

కమ్యూనిస్టు పార్టీలపై మండిపడ్డ భాజపా ఎంపీ లక్ష్మణ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details