జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో తెరాసకు ఎంఐఎం మద్దతు ఊహించిందేనని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియా సభలో దివంగత ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ సంతాపం కూడా తెలపలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం సీఎంకు పరిపాటి అని విమర్శించారు.
రాజన్న రాజ్యం వద్దు.. రామారాజ్యం కావాలి...
గిరిజన మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను గద్దె దించుతారని అన్నారు. కొత్త పార్టీ పెట్టబోతున్నందున వైఎస్ షర్మిలకు అర్వింద్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని.. రామరాజ్యం కావాలని చెప్పారు.
ఇదీ చూడండి:'సాగర్ ఉపఎన్నికతోనే తెరాస ప్రభుత్వ పతనం'