ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి జలాల విషయంలో మొదటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. తెరాస అవినీతిపై కేంద్రంతో పాటు.. తాము కూడా డేగ కన్నుతో నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
''ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ నీటిని వాడుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. ఆ సమయంలో కేసీఆర్ ఏమి చేస్తున్నారు? తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను దోచుకుంటున్నారు. 203 జీవో విషయంలో నేను స్పందించి కేంద్రానికి లేఖ రాసేవరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? ఆగస్టు 5వ తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్‌ను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది?''
-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్