తెలంగాణ

telangana

ETV Bharat / state

Bjp MP Aravind On TRS: కాంగ్రెస్‌, తెరాస మధ్య నూటికి నూరుశాతం పొత్తు: అర్వింద్ - ఎంపీ అర్వింద్

Bjp MP Aravind On TRS: వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ జత కడతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. పొత్తులో భాగంగానే రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థికి తెరాస మద్దతు ప్రకటించిందని తెలిపారు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Bjp MP Aravind On TRS
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌

By

Published : Jun 28, 2022, 4:15 PM IST

Bjp MP Aravind On TRS: నూటికి నూరు శాతం తెరాస, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్​ సిన్హాకు తెరాస మద్దతు ప్రకటించిందని వెల్లడించారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాకుండా తెరాస వ్యతిరేకంగా ఓటు వేస్తోందని ధ్వజమెత్తారు. తెరాస ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

బీసీ కమిషన్ ఎప్పుడు వేసిండు. హుజూరాబాద్ ఎన్నిక కోసం ఏసిండు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏసిండా. భవనాలు ఎక్కడ కట్టిండో చూపిస్తారా. కేసీఆర్ బీఆర్​ఎస్ ఏమైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజనులకు తెరాస వ్యతిరేకం పనిచేస్తోంది. పిలవకున్నా కూడా పోయి మద్దతు ఇస్తున్నరు. భాజపా విధానాలు తెరాసకు చాలా ప్రమాదకరం.

- ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస పొత్తుకు తొలిమెట్టుగా ఎంపీ అర్వింద్ అభివర్ణించారు. బీఆర్‌ఎస్‌ ఎక్కడికి పోయిందో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖాజిపేట కోచ్‌ ఫ్యాక్టరీకి భూమి కేటాయించి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేదని తెలిపారు. భూమి కేటాయించలేని తెరాస నేతలు విభజన హామీల గురించి మాట్లాడటం ఏంటని ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్‌కు చెందిన 13ఏళ్ల పూర్ణ ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోని 7పర్వతాలను అధిరోహించి చరిత్ర సృష్టించిందని తెలిపారు. పూర్ణకు ధర్మపురి అర్వింద్ ఫౌండేషన్ ద్వారా 3 లక్షల 51వేలు అందజేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ అంబాసిడర్‌గా పూర్ణను నియమించాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌, తెరాస మధ్య నూటికి నూరుశాతం పొత్తు: అర్వింద్

ఇవీ చదవండి:

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో చిన్న వాహనాలకు అనుమతి.. ఉత్తర్వులు జారీ

21 మందిని వేటాడిన ఆడపులి.. ఎట్టకేలకు బోనులోకి...

ABOUT THE AUTHOR

...view details