MP Arvind on KTR: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొకైన్ టెస్టుకు నమూనాలు ఇచ్చేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉండాలని భాజపా ఎంపీ సవాల్ విసిరారు. తంబాకు టెస్టుకు బండి సంజయ్‌ను తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోకు తూట్లు పొడిచి కేటీఆర్ జన్వాడలో ఫాంహౌస్ కట్టారని విమర్శించారు. ఆ ఫాంహౌస్‌ను కూల్చే ధైర్యం కేటీఆర్‌కు ఉందా? అని.. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్వింద్ ప్రశ్నించారు.
మంత్రి కేటీఆర్ అక్రమంగా వేల కోట్లు సంపాదించారని అర్వింద్ ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే బియ్యం బ్లాక్ మార్కెట్‌పై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. తనపై పోటీకి కల్వకుంట్ల కవితను నిలబెడితే మళ్లీ ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ వందశాతం కలసి పోటీచేస్తాయని అర్వింద్ అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యేకు హనుమకొండలో ఏం పని ఉందని అర్వింద్ ప్రశ్నించారు.