కరోనా వ్యాప్తిని నిరోధించడానికి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. దీనికి వ్యాక్సిన్ లేనందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్లిన వ్యక్తి కరోనాతో చనిపోవడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయన్నారు.
కరోనాపై అవగాహన పెంచాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు - తెలంగాణలో కరోనా ప్రభావం
రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. కోవిడ్-19పై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయ్యాలని సూచించారు.

కోవిడ్-19పై అవగాహన పెంచాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు
చాలా చోట్ల పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ సభలు రద్దు చేసుకుంటున్నారు. కొందరు వివాహాలనూ వాయిదా వేసుకుంటున్నారని వివరించారు. తీసుకోవాల్సిన తగు ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కరోనాపై అవగాహన పెంచాలి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు
ఇదీ చూడండి:సంకల్ప బలం ముందు ఓడిన క్యాన్సర్