రాష్ట్రంలో అదృశ్యమవుతోన్న మహిళల గురించి భాజపా ఆందోళన వ్యక్తం చేస్తోంటే అలజడి సృష్టిస్తోందన్న తెరాస నాయకుల ఆరోపణలపై భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు మండిపడ్డారు. తమ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్నట్లు గులాబీ పార్టీ భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో మజ్లీస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తెరాస తెలంగాణను బంగాల్గా మారుస్తోందన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ భాజపా అని అన్నారు.
'ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ భాజపా' - భాజపా ఎమ్మెల్సీ రామచందర్రావు
రాష్ట్రంలో నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడే పార్టీ భాజపా అని ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్రావు అన్నారు. కమలం పార్టీ అలజడి సృష్టిస్తోందన్న తెరాస విమర్శలపై మండిపడ్డారు.
భాజపా ఎమ్మెల్సీ