'ఆ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడగించడం సరికాదు ' - BJP MLC Ramchandar Rao fire on TNGO Leaders
టీఎన్జీవో నేతలు కొంతమంది కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు మండిపడ్డారు. దానిని మానుకోవాలని హితవు పలికారు. తెరాస సర్కారు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీ మీద దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఆ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడగించడం సరికాదు '
తెలంగాణ ప్రభుత్వం టీఎన్జీవో నాయకులకు సంబంధించిన వ్యక్తుల పదవీ కాలాన్ని పొడగిస్తూ జీవో జారీ చేయడాన్ని భాజపా తప్పుపట్టింది. అనేక మంది ఉద్యోగులు తమ సర్వీస్ పొడగించాలని దరఖాస్తు చేసుకున్నా వాటిని పక్కనపెట్టిందని ఆపార్టీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోయి ఉన్నాయన్నారు. లాక్‌డౌన్ పేరుతో తెరాస సర్కారు ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత విధిస్తోందని ఆయన మండిపడ్డారు.