తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస, ఎంఐఎంలు ఒక్కటేనని మరోసారి రుజువైంది' - MLC Ramachandra Rao Latest News

తెరాస, ఎంఐఎంలపై ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు వేరు వేరు కాదని మరోసారి రుజువైందని వెల్లడించారు.

BJP
'తెరాస, ఎంఐఎంలు ఒక్కటేనని మరోసారి రుజువైంది'

By

Published : Feb 12, 2021, 10:16 AM IST

రాష్ట్రంలో తెరాస, ఎంఐఎం రెండు పార్టీలు వేరు వేరు కాదని.. ఒక్కటేనని మరోమారు రుజువు అయిందని.. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల సమయంలో రెండు పార్టీలు బద్ద శత్రువులుగా తిట్టుకుని.. ఇప్పుడు మిలాఖత్​ అంటున్నాయని మండిపడ్డారు.

తెరాస, ఎంఐఎం పార్టీల స్నేహ బంధాన్ని బట్టబయలు చేసేందుకే మేయర్ ఎన్నికల్లో భాజపా పోటీ చేసిందన్నారు. ఇప్పుడు అది రుజువు అయిందని వెల్లడించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేని తెలిపారు. తాము ఓడిపోయి... తెరాస, ఎంఐఎం రెండు ఒక్కటేనని రుజువు చేశామన్నారు. రెండు పార్టీలు చేసే.. అక్రమాలను ఎండగడుతామని.. మంచి పనులు చేస్తే.. తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details