తెలంగాణ

telangana

ETV Bharat / state

తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్ - తార్నాక తాజా వార్తలు

భాజపా నేత రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే తాము ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వలేదని, భాజపాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గృహ నిర్బంధం చేసి తమ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.

bjp mlc ramachandra rao house arrest in tarnaka
తార్నాకలో భాజపా నేత రాంచందర్‌రావు హౌస్ అరెస్ట్

By

Published : Nov 2, 2020, 12:30 PM IST

భాజపా నేత, ఎమ్మెల్సీ రాంచందర్‌రావును తార్నాకలో ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రగతిభవన్ ముట్టడిస్తారంటూ భాజపాపై అసత్య ప్రచారం చేశారని రాంచందర్‌రావు ఆరోపించారు. తమ పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వలేదని ఆయన స్పష్టం చేశారు.

భాజపా నాయకులను అన్యాయంగా హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా కార్యక్రమం చేపడితే సంఘటనాస్థలిలో అరెస్టు చేయాలని అన్నారు. గృహ నిర్బంధం చేసి తమ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. తెరాస అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తాము ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగాన్ని గౌరవిస్తామని అన్నారు. హింసాత్మక కార్యక్రమాలకు భాజపా వ్యతిరేకమని, నాటి ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:'భాజపా కార్యకర్తలను బెదిరించేలా కేటీఆర్‌ మాట్లాడటం సరికాదు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details