కొవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్న పోలీస్ శాఖను భాజపా ఎమ్మెల్సీ రాం చందర్ రావు అభినందించారు. అందులో భాగంగానే తన వంతు సాయంగా సీపీ అంజనీ కుమార్కు 6 వేల యూనిట్ల బటర్ మిల్స్, పండ్ల రసాలను అందజేశారు. వాటిని హైదరాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి అందజేయనున్నట్లు వివరించారు.
పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఎమ్మెల్సీ - పోలీసులకు బటర్ మిల్క్, పండ్ల రసాలను అందజేత
కరోనా కాలంలోనూ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు 6 వేల యూనిట్ల బటర్ మిల్క్, పండ్ల రసాలను అందజేశారు.
![పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఎమ్మెల్సీ mlc ram chander rao distributed fruit juice to police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8049940-44-8049940-1594898860386.jpg)
పోలీసులకు పండ్ల రసాలు అందజేసిన ఎమ్మెల్సీ
అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు, ప్రభుత్వ ఆసుపత్రులకు పండ్ల రసాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ రాంచందర్ రావు తెలిపారు. గతంలో కూడా వేల యూనిట్ల జ్యూస్ ప్యాకెట్లను అందజేసినట్లు ఆయన వివరించారు.