ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే వినాయక చవితి పండుగ కరోనా వల్ల ఈ ఏడాది నిరాడంబరంగా జరుపుకోవాల్సి వస్తోందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవాలను నిలిపివేయాలని పోలీసులు బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. నగర శివారు ప్రాంతాల్లో నిమజ్జనం చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లేవి: ఎమ్మెల్సీ రాంచందర్ రావు
గణేశ్ నిమజ్జనానికి పోలీసులు సహకరించాలని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లేవి:
ఒక వర్గం పండుగలకు అనుమతిస్తూ బోనాలు, గణేశ్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. నిమజ్జనానికి ట్యాంక్ బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి వివక్ష చూపకుండా నిమజ్జనానికి సహకరించాలని రాంచందర్ రావు కోరారు. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
- ఇదీ చూడండి:'భారీ సంస్కరణలతోనే ఆర్థిక రికవరీ సాధ్యం'
TAGGED:
bjp mlc ram chandar rao