పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తెరాస దాదాపు 2 వందల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఓటర్ల తీర్పును శిరసావహిస్తానన్న రాంచందర్‌రావు... భవిష్యత్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగస్తులను బెదిరించారని విమర్శించారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా పోరాడతామని స్పష్టం చేశారు.
డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచింది: రాంచందర్‌రావు - telangana news
డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు చాలా స్పష్టంగా కన్పించిందని వెల్లడించారు. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
డబ్బు, అధికార బలంతోనే తెరాస గెలిచింది: రాంచందర్‌రావు