పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించి... బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడిందని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. మంత్రులు మాట్లాడిన రికార్డులు తన వద్ద ఉన్నాయని... ఫలితాల అనంతరం ఎన్నికల సంఘాన్ని కలుస్తానని అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచి పట్టభద్రుల ఎన్నికల విలువ పోగొట్టారని ఆయన ధ్వజమెత్తారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించింది' - hyderabad district latest news
రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధిస్తానని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరపాలని కోరారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం కోడ్ ఉల్లంఘించింది'
డబ్బులు తీసుకొని ఓటు వేశామని కొందరు తనకు ఫోన్ చేసి పశ్చాత్తాపపడుతున్నారని రామచంద్రరావు తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధిస్తానన్న నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో 55 మంది ఎలిమినేషన్