తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్టు

నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి వ్యతిరేకంగా సచివాలయ ముట్టడికి యత్నించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం వందల కోట్లు వృథా చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​

By

Published : Jun 27, 2019, 2:17 PM IST

సచివాలయ ముట్టడికి యత్నించిన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నూతన సచివాలయ భవనాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కమలం పార్టీ ముట్టడికి పిలుపునిచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిని ముషీరాబాద్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ప్రజా ధనం వృథా...

సీఎం కేసీఆర్​ ఆరువందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ మండిపడ్డారు. ఎన్టీఆర్​ కట్టించిన నిర్మాణాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. పేదల కోసం రెండు లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామన్న ముఖ్యమంత్రి... 20 వేల ఇళ్లు కూడా కట్టలేదని దుయ్యబట్టారు.

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ అరెస్టు

ఇదీ చూడండి : సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ

ABOUT THE AUTHOR

...view details