తెలంగాణ

telangana

ETV Bharat / state

'రంజాన్​కి లేని నిబంధనలు బోనాలకా..? మార్గదర్శకాలు ఇవ్వాలన్న రాజాసింగ్.. - bjp mla rajasingh

బోనాల పండుగ నిర్వహణకు ప్రభుత్వం నిబంధనలు పెట్టడం సరైంది కాదని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ అన్నారు. రంజాన్​కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని బోనాల ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీ రాంచందర్​ రావుతో కలిసి డిమాండ్​ చేశారు.

bjp mla rajasingh spoke about bonalu festival in telangana
'బోనాల నిర్వహణకు నిబంధనలు పెట్టడం సరైంది కాదు'

By

Published : Jun 17, 2020, 3:51 PM IST

రంజాన్​కు అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బోనాల నిర్వహణకు నిబంధనలు పెట్టడం సరైంది కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని బోనాల ఏర్పాట్లకు ప్రభుత్వం మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం ఇంటికి ఒక్కొరికైనా అనుమతి ఇచ్చేలా ఆలోచించాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలిసి రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు. బోనాల ఏర్పాట్లపై భక్తులను ఆలయాలకు అనుమతించే విషయంపై ప్రభుత్వం పునరాలోచించకపోతే తాము నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.

బోనాల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి తమకు సమయం ఇస్తే పార్టీ తరుఫున వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ బోనాలు నిర్వహించాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక ఆర్డినెన్స్ సరైంది కాదన్నారు.

ఇవీ చూడండి: విద్యుత్​ బిల్లులపై సీఎం కేసీఆర్​కు జీవన్​రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details