BJP MLA Rajasingh Received Threat Calls : బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు(Rajasingh) గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. తనకు ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తులు 97199942827, 914223532270, 914223532270 నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
బెదిరించడం కాదు దమ్ముంటే నేరుగా రావాలంటూ సదరు వ్యక్తులకు రాజాసింగ్ సవాల్ విసిరారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డ్స్‌ను రాజాసింగ్ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్ రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.