తెలంగాణ

telangana

ETV Bharat / state

'సన్నబియ్యం పంపిణీ పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు' - goshamahal mla rajasingh latest news

రేషన్​ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్​ విమర్శించారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

bjp mla rajasingh fires on cm kcr
'సన్నబియ్యం పంపిణీ పేరిట తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

By

Published : Jan 4, 2021, 6:25 PM IST

ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈరోజు ఉదయం స్థానికంగా ఉన్న ఓ రేషన్ దుకాణాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడారు. సగం సన్న బియ్యం, సగం దొడ్డు బియ్యం ఇస్తున్నట్లు స్థానికులు ఆయనకు వివరించారు.

సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్న ప్రభుత్వానికి ఈ విషయం దృష్టిలో ఉందా అని రాజాసింగ్​ ప్రశ్నించారు. ఈ విషయంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసినందుకు గానూ సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: 'వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్​ఫామ్ సాగు'

ABOUT THE AUTHOR

...view details