తెలంగాణ

telangana

ETV Bharat / state

నిందితులను వదిలిపెట్టి.. పోరాడే వారిపైనే కేసులా?: రాజాసింగ్ - raghunandan rao

Rajasingh On Rape Case: అసలైన నిందితులను వదిలిపెట్టి న్యాయం కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెడతారా అంటూ భాజపా శాసనసభపక్షనేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్​లో జరిగిన ఘటనలో నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్​ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.

Rajasingh On Rape Case
రాజాసింగ్

By

Published : Jun 7, 2022, 11:00 PM IST

Rajasingh On Rape Case: బాధితురాలికి న్యాయం కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రఘునందన్​రావుపై కేసు నమోదు చేయడాన్ని భాజపా శాసనసభపక్షనేత రాజాసింగ్ ఖండించారు. కేసీఆర్ పాలనలో అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శించారు. అసలైన నిందితులను విడిచిపెట్టి ప్రశ్నించిన వారిపైనే కేసులా పెడతారా అంటూ నిలదీశారు.

జూబ్లీహిల్స్‌ ఘటనలో నిందితులను ఎందుకు అరెస్టు చేయరని రాజాసింగ్ ప్రశ్నించారు. తెరాస, ఎంఐఎం తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఆయన విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. తెరాస, మజ్లిస్ నేతల అరాచకాలను పాతరేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటామని తెలిపారు. అధికార పార్టీ బెదిరింపులు పోలీసుల లాఠీ ఛార్జ్​లకు, కేసులకు భయపడి ప్రసక్తే లేదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు భాజపా ఉద్యమిస్తుందని రాజాసింగ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details