'భారతదేశంలోని అయోధ్య వాస్తవమైంది కాదని.. రాముడు భారత్లో పుట్టలేదని' నేపాల్ ప్రధాని కేపీ.హోలీ చేసిన వ్యాఖ్యలను గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.
నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం - హైదరాబాద్ వార్తలు
నేపాల్ ప్రధాని కేపీ.హోలీ వ్యాఖ్యలపై గోషామహాల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రాముడిపై హూలీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై రాజాసింగ్ ఆగ్రహం
నేపాల్‌లోని ఈర్‌గంజ్‌లో రాముడు పుట్టాడని కేపీ.హోలీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేపాల్‌లోని ఆలయాలను అభివృద్ధి చేయడం చేతగాని హోలీకి అయోధ్యపై మాట్లడే అర్హత లేదన్నారు. నేపాల్‌లోని ఎక్కువశాతం మంది ప్రజలు భారత్‌దేశంలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. కేపీ.హోలీకి చేతనైతే ఈర్‌గంజ్‌లో రాముడికి పెద్ద గుడి కట్టివ్వాలని సూచించారు.
ఇదీ చూడండి:బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక