దీపావళి కానుకగా కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన వేళ... రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. తెరాస సర్కార్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిందని గుర్తు చేశారు. హుజూరాబాద్ లాంటి ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్‌కు జోష్ వస్తుందా అని విమర్శించారు.
పెట్రోల్‌పై 41 రూపాయలు పన్ను వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం 8 నుంచి 10 రూపాయలైనా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు రాష్ట్రంలో లీటర్ కనీసం 100 రూపాయలకైనా వస్తుందన్నారు. కేంద్రాన్ని విమర్శించడం సులభమే దానిని ఆచరణలో పెట్టడానికి ధైర్యముండాలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం 5, 10 రూపాయలు తగ్గించింది. చాలావరకు మన ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేశారు. ఇప్పడు నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రాన్ని టార్గెట్ చేసినారు కదా. మరీ మీరు కూడా 41 రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నరు. మీరు అంత తగ్గించాల్సినా అవసరం లేదు. మీరు కూడా కనీసం 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గిస్తే మనరాష్ట్రంలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలకు దొరుకుతది. సీఎం కేసీఆర్ గారు దీని మీరు కూడా ఆలోచించండి. కేవలం ఉపఎన్నికలోస్తేనే జోష్ వస్తదా.. మరో బై ఎలక్షన్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా.. మరో స్కీమ్ తెచ్చేందుకు రెడీ అవుతున్నారా..?-రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే