Raghunandan Rao Fires on Niranjan Reddy: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు. ఫామ్‌హౌస్ భూమికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలకు నిరంజన్‌రెడ్డి వివరణపై రఘనందన్‌రావు మాట్లాడారు. మంత్రి నిరంజన్ రెడ్డి సూటిగా కాకుండా అనేక విషయాలను దాటవేశారని అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో దస్త్రాలుంటే రైతులకు ఎందుకు పహానీలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చైనా పౌరుడితో నిరంజన్‌రెడ్డి తరచూ మాట్లాడారని.. చైనా వాసి 'మో' వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఈడీని కోరతానని తెలిపారు. మంత్రి దత్తపుత్రుడు గౌడ్ నాయక్‌పై ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.
Raghunandan Rao comments on Niranjan Reddy: అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా నిరంజన్ రెడ్డి తన వియ్యంకుడిని నియమించారని రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రి పొలం, ఇల్లు రూ.4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని అన్నారు. ఆయన భూమి వరకు 3 కిలో మీటర్లు సీసీ రోడ్డు వేశారని విమర్శించారు. ఈ సీసీ రోడ్డును రైతులతో కలిసి వేసుకున్నట్లు మంత్రి చెప్పారని తెలిపారు. రూ.5 కోట్ల ఖర్చు అయ్యే సీసీ రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించారా? అని రఘనందన్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ దత్తపుత్రుడికి అప్పగిస్తున్నారని ఆరోపణలు చేశారు. చైనాకు చెందిన మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్‌రెడ్డికి సంబంధం ఏమిటి? చెప్పాలని పేర్కొన్నారు. చైనా వ్యక్తికి మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారని నిలదీశారు.