Raghunandan Rao on Speaker: ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ తమను సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేదని విమర్శించారు. భాజపా ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట చేపట్టిన ధర్నాలో రఘునందన్‌రావు మాట్లాడారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ భాజపాతోనే జరుగుతుందని రఘునందన్‌రావు అన్నారు. కేసీఆర్‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని తెలిపారు. పార్టీ అనుమతి తీసుకుని అన్ని కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. నల్లకండువాలు వేసుకుంటే సభ నుంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.